కల్యాణ్ రామ్ ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే'
- కథానాయికగా తమన్నా
- ఈ నెల 6వ తేదీన ఆడియో రిలీజ్
పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. షేరేత్ సంగీతం ఈ సినిమాకి కొత్తదనాన్ని తెస్తుందని అంటున్నారు. ఈ నెల 6వ తేదీన ఆడియో వేడుకను భారీస్థాయిలో జరపనున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడని చెబుతున్నారు. తెలుగులో తమన్నాకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా ఆమెకి మరొకొన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి.