'మహానటి' నుంచి మరో మధురమైన సాంగ్ రిలీజ్
- సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
- వచ్చేనెల 9వ తేదీన విడుదల
- అలరిస్తోన్న మరో సాంగ్
సమంత .. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ సాంగ్ ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను .. చారులతా మణి ఆలపించారు. మిక్కి జె. మేయర్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ మనసును సుతారంగా తాకుతూ .. మధురానుభూతిని కలిగిస్తోంది. మొత్తానికి ఈ పాట ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేదిలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.