anam vivekananda reddy: ఆనం వివేకాకు నివాళి అర్పించిన చంద్రబాబు
టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం వివేకా సోదరుడు రాంనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సాయంత్రం వివేక అంతిమ యాత్ర జరగనుంది. పెన్నానది తీరంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. మరోవైపు, వివేకాను తుదిసారి చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో వివేక తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.