govener: అందుకే, చంద్రబాబుతో నరసింహన్ మాట్లాడింది!: వీహెచ్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన నరసింహన్ తిరుగు ప్రయాణంలో విజయవాడలో బస చేయడం.. ఆయన్ని చంద్రబాబు భేటీ కావడం విదితమే.

 ఈ విషయమై వీహెచ్ మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీకి టీడీపీ మద్దతు కూడగట్టడం కోసమే నరసింహన్ ఏపీకి వెళ్లి చంద్రబాబుతో మాట్లాడారని, గవర్నర్ తన పని మానేసి మధ్యవర్తిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఢిల్లీ పర్యటనల గురించీ వీహెచ్ విమర్శలు చేశారు. 
Go Back to Shorts
govener
narasimhan
vh

More Telugu News