దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

  • సోషల్ మీడియాలో తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు  
  • చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
  • రాధాకృష్ణ పేరుపై ఎలాంటి అకౌంట్లు లేవు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పేరుపై కొందరు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో నకిలీ అకౌంట్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. ఆయన పేరుతో ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఎలాంటి అకౌంట్లు లేవని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లో  abnandhrajyothy, ట్విట్టర్ లో abntelugutv మాత్రమే తమ అఫీషియల్ అకౌంట్లు అని తెలిపింది. నకిలీ అకౌంట్లను క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
abn
andhrajyothy
radhakrishna
Social Media
accounts

More Telugu News