'అందరికీ ధన్యవాదాలు' అంటోన్న కొరటాల
- రికార్డులు సృష్టోస్తోన్న 'భరత్ అనే నేను'
- ఆనందాన్ని వ్యక్తం చేసిన మహేశ్
- సంతోషంతో పొంగిపోతోన్న కొరటాల
తాజాగా కొరటాల కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సినిమాకి ఈ స్థాయిలో లభిస్తోన్న ఆదరణ తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ట్విట్టర్ ద్వారా కొరటాల తెలియజేశాడు. తమ ప్రయత్నాన్ని ప్రశంసిస్తోన్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాకి ముందు మహేశ్ నుంచి రెండు ప్లాపులు వచ్చాయి. దాంతో కొరటాలపై మరింతగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ ఒత్తిడిని అధిగమిస్తూ విజయాన్ని అందుకున్న ఆయన, ఆనందంతో పొంగిపోతున్నాడు.