సినిమా రిలీజ్ కి ముందేకాదు .. ఆ తరువాత కూడా నిద్రపట్టలేదు: మహేశ్ బాబు
Add ap7am to your home Screen

సినిమా రిలీజ్ కి ముందేకాదు .. ఆ తరువాత కూడా నిద్రపట్టలేదు: మహేశ్ బాబు

  • నా కెరియర్లో నేను బాగా చేసిన సినిమా 
  • కొరటాల పనితీరు అద్భుతం 
  • సందేశాలు గుర్తుపెట్టుకుంటే చాలు  
మహేశ్ బాబు నుంచి వచ్చిన 'భరత్ అనే నేను' రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ .. విజయవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి మహేశ్ బాబు స్పందించారు. 'ఈ సినిమా విడుదలకు ముందు టెన్షన్ తో 10 రోజులుగా నిద్రపట్టలేదు .. సినిమా రిలీజ్ అయిన తరువాత వస్తోన్న రెస్పాన్స్ చూసి సంతోషంతో నిద్రపట్టడం లేదు' అన్నారు.

"నాకు తెలిసి నా కెరియర్లో నేను బాగా నటించిన సినిమాల జాబితాలో ఈ సినిమా ముందుగా నిలుస్తుంది. ఈ సినిమాలోని పాత్రలను కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దాడు .. పవర్ ఫుల్ మూవీగా జనం ముందు నిలబెట్టాడు. ఇక ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన కథే అయినా, ఎక్కడా వివాదాలకు అవకాశం లేకుండా చూడటం విశేషం. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాలు ఏ మాత్రం గుర్తుపెట్టుకున్నా అంతకి మించిన సంతోషం లేదు"అని చెప్పుకొచ్చారు.
   
Mahesh Babu
kiara advani

More Telugu News