ఆస్ట్రేలియాలో 'బాహుబలి' తరువాత ప్లేస్ లో 'భరత్ అనే నేను'
Add ap7am to your home Screen

ఆస్ట్రేలియాలో 'బాహుబలి' తరువాత ప్లేస్ లో 'భరత్ అనే నేను'

  • తెలుగు రాష్ట్రాల్లో 'భరత్' దూకుడు 
  • ఆస్ట్రేలియాలోను అదే జోరు 
  • అక్కడ కొత్త రికార్డు నమోదు
మహేశ్ బాబు అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. తామంతా ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న భారీ విజయం మహేశ్ కి లభించడమే అందుకు కారణం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోను ఈ సినిమా తన హవాను కొనసాగిస్తోంది. తొలి రోజున 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టి ఆశ్చర్యచకితులను చేసింది.

శని .. ఆదివారాల్లోను ఈ సినిమా అదే జోరును కొనసాగించింది. ఈ మూడు రోజుల్లోను కలుపుకుని ఈ సినిమా అక్కడ 3.39 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టి, సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓపెనింగ్స్ విషయంలో 'బాహుబలి' తరువాత స్థానంలో నిలిచింది. 2.89 లక్షల డాలర్లతో 'రంగస్థలం' మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొత్తానికి అనుకున్నట్టుగానే మహేశ్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.  
Mahesh Babu
kiara advani

More Telugu News