ఆహ్లాదభరితంగా .. ఆనందకరంగా 'మహానటి' సాంగ్
- సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్
- జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్
- మే 9న భారీస్థాయిలో రిలీజ్
ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ ఇద్దరూ ప్రేమలోపడిన సందర్భంలో ఈ సాంగ్ రానుందని తెలుస్తోంది. సిరివెన్నెల సాహిత్యం .. మిక్కీ జె. మేయర్ సంగీతం .. శ్రేయ ఘోషల్ స్వరం మనసు తలుపు తట్టేలా వున్నాయి. అద్భుతంగా వేసిన అందమైన సెట్ లో చిత్రీకరించిన ఈ పాట .. సావిత్రి కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపించకమానదు. మధురమైన ఈ మెలోడీ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.