Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు ప్రజా సమస్యల గురించి ఏం తెలుసు?: ఎంపీ జేసీ

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఉరవకొండలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ దీక్ష చేశారు. ఈ దీక్షలో జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు సినిమాలంటే తెలుసు కానీ, ప్రజా సమస్యల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. సినిమాల్లో నటించినట్టుగా ప్రజాజీవితంలో నటించడం కుదరదని, పవన్ కల్యాణ్ ఓ బచ్చా అని అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపైనా ఆయన విమర్శలు చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని నాడు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారని, ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిన విషయమేనని, జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతేనని జేసీ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Pawan Kalyan
mp jc

More Telugu News