ఫిలిం ఛాంబర్‌లో ధర్నాకు దిగిన పవన్ కల్యాణ్‌.. వర్మతో పాటు 'మా'పై తీవ్ర ఆగ్రహం
Add ap7am to your home Screen

ఫిలిం ఛాంబర్‌లో ధర్నాకు దిగిన పవన్ కల్యాణ్‌.. వర్మతో పాటు 'మా'పై తీవ్ర ఆగ్రహం

  • నా తల్లికి న్యాయం చేయాలి
  • ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లేది లేదు
  • నా తల్లిని ఎందుకు దూషించారు?
తన తల్లికి న్యాయం చేసే వరకు తాను ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లేది లేదని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. తన తల్లిని ఎందుకు దూషిస్తారని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ఘటనలు మంచివా? అంటూ నిర్మాతల మండలి, మా అసోసియేషన్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్‌ కల్యాణ్‌తో ఆయన తల్లి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌ వద్దకు మెగా అభిమానులు కూడా వస్తోన్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చెలరేగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.
Pawan Kalyan
RGV
Tollywood

More Telugu News