శ్రీరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసి... వెంటాడిన పవన్ ఫ్యాన్స్!
Add ap7am to your home Screen

శ్రీరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసి... వెంటాడిన పవన్ ఫ్యాన్స్!

  • టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమానికి వెళ్లిన శ్రీరెడ్డి
  • ఛానెల్ కార్యాలయం దగ్గరకి చేరుకున్న పవన్ ఫ్యాన్స్
  • ఇంటికి వెళ్తుండగా ఆమె కారును వెంబడించిన వైనం 
సినీ నటి శ్రీరెడ్డిని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు వెంటాడిన ఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ లోని ఒక టీవీ ఛానెల్‌ లో చర్చావేదికలో పాల్గొనేందుకు గత రాత్రి శ్రీరెడ్డి చేరుకుందన్న విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని, నినాదాలతో హోరెత్తించారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దాంతో ఛానెల్ సిబ్బంది ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు, వారిని నియంత్రించారు. అనంతరం మరో మార్గం ద్వారా ఆమెను ఇంటికి పంపించే ప్రయత్నం చేయగా, దానిని గమనించిన కొందరు అభిమానులు ఆమె వాహనాన్ని అనుసరించారు. దీంతో పోలీసులు ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ క్రమంలో పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆమెను పోలీసు వాహనంలో ఇంటి వద్ద దిగబెట్టారు.
srireddy
Pawan Kalyan fans
Hyderabad

More Telugu News