'మహానటి' నుంచి కీర్తి సురేశ్ ఫస్టులుక్... అదిరింది!
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి'
- సావిత్రిగా కనిపించనున్న కీర్తి సురేశ్
- మరికొంత సేపట్లో టీజర్ రిలీజ్
సావిత్రి లుక్ లో కీర్తి సురేశ్ ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఒక్కసారిగా చూస్తే నిజంగానే ఇది సావిత్రి ఫోటోనే అనుకునేట్టుగా ఈ ఫస్టులుక్ వుంది. సావిత్రి లుక్ తో కీర్తి సురేశ్ ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మరికొంత సేపటిలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను కూడా వదలనున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.