ఎయిరిండియాను రిలయన్స్‌కు కట్టబెట్టే యత్నాలు షురూ?
- ఎయిరిండియాలో 76 శాతం షేర్ల విక్రయానికి ప్రభుత్వం రెడీ
- రిలయన్స్‌తో కలిసి బిడ్డింగ్‌కు ఎతిహాద్ ఎయిర్‌వేస్
- అనుమానం వ్యక్తం చేస్తున్ననిపుణులు
ఎయిరిండియాలో 76 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా జరుగుతున్న బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఎతిహాద్ ఎయిర్‌వేస్ పావులు కదుపుతోంది. రిలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా డీల్ ఓకే చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రిలయన్స్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ రెండు సంస్థల మధ్య జరుగుతున్న చర్చల విషయం తెలిసి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం పథకం ప్రకారం పావులు కదుపుతోందని చెబుతున్నారు. వచ్చే నెల 14తో బిడ్డింగ్ ముగియనుండడంతో ఈ రెండు సంస్థలు ఒక్కటైతే ఎయిరిండియాను చేజిక్కించుకోవడం ఖాయమని అంటున్నారు.