'భరత్ అనే నేను'పై నమ్మకంతోనే కొరటాల అలా చేశాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భరత్ అనే నేను'పై నమ్మకంతోనే కొరటాల అలా చేశాడట!

  •  'భరత్ అనే నేను' కోసం ఆడియన్స్ వెయిటింగ్ 
  • 22 కోట్లకు నైజామ్ హక్కులు 
  • బలమైన నమ్మకంతో కొరటాల
ఈ నెల 20వ తేదీన 'భరత్ అనే నేను' భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల .. మహేశ్ కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాకి ఒక రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఈ సినిమా నైజామ్ హక్కులు 22 కోట్లకి అమ్ముడయ్యాయట.

 నైజామ్ ఏరియాలోని కొంతభాగం డిస్ట్రిబ్యూషన్ కొరటాల తీసుకున్నారని అంటున్నారు. నైజామ్ లో మహేశ్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది .. మంచి మార్కెట్ వుంది. ఆయన సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లను రాబడతాయి. అందువల్లనే నైజామ్ ఏరియాలోని కొంతభాగం డిస్ట్రిబ్యూషన్ ను కొరటాల తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనీ .. భారీ వసూళ్లను రాబడుతుందనే బలమైన నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.     
koratala
Mahesh Babu

More Telugu News