'మహానటి' నుంచి రేపే ఫస్టు టీజర్ రిలీజ్
Add ap7am to your home Screen

'మహానటి' నుంచి రేపే ఫస్టు టీజర్ రిలీజ్

  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • ఆమె స్పెషల్ లుక్ రిలీజ్ రేపే 
  • మే 9వ తేదీన సినిమా విడుదల
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించగా, జర్నలిస్ట్ 'మధురవాణి' పాత్రను సమంత పోషించింది. ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకి సంబంధించిన పోస్టర్స్ ను వదులుతూ వస్తున్నారు.

 సావిత్రిగా కీర్తి సురేష్ పూర్తి లుక్ ను రేపు రిలీజ్ చేస్తారట. అలాగే ఫస్టు టీజర్ ను రేపు వదలనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. 'మహానటి' పై ఒక్కసారిగా అంచనాలు పెరిగేలా ఈ టీజర్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సావిత్రికి గల క్రేజ్ .. ఆమె జీవితంలోని ఆసక్తికరమైన మలుపులు .. అలనాటి నటీనటుల పాత్రలను మంచి ఇమేజ్ వున్న ఆర్టిస్టులు చేయడం ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పుకోవాలి.       
keerthi suresh
samanta

More Telugu News