కుండపోత వర్షానికి కుప్పకూలిన తాజ్ మహల్ మినార్!
- కూలిన దర్వాజా - ఏ - రౌజా
- గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఘటన
- 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు మినార్ కూలిపోయి ముక్కలు ముక్కలైందని, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని తాజ్ మహల్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఏఎస్ఐ (ఆర్కియోలాజికల్ సొసైట్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. మినార్ పైన అమర్చిన కలశం సహా అన్ని ముఖ్యమైన భాగాలనూ భద్రపరిచినట్టు తెలిపింది.