ఐపీఎల్‌లో రోహిత్ రికార్డును బద్దలుగొట్టిన రైనా
- ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్‌గా రికార్డు
- మొత్తం 174 సిక్సర్లతో రోహిత్‌ను వెనక్కి నెట్టిన సీఎస్‌కే బ్యాట్స్‌మన్
- 265 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న గేల్
రోహిత్ 160 మ్యాచుల్లో 173 సిక్సర్లు కొట్టగా రైనా 174 సిక్సర్లతో రోహిత్‌ను అధిగమించాడు. కాగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ ఇప్పటి వరకు 265 సిక్సర్లు నమోదు చేశాడు.