samanta: ఒక్కసారి నేను తల్లిగా మారితే, ఇక నాకు పిల్లలే ప్రపంచం: హీరోయిన్‌ సమంత

తాను, తన భర్త నాగ చైతన్య పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని, పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నామని హీరోయిన్ సమంత తెలిపింది. ఆ టైమ్‌ వచ్చే వరకు తమ కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని చెప్పింది. హీరోయిన్‌ సమంత తల్లి కాబోతోందంటూ ఇటీవల బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించి ఇలా వ్యాఖ్యానించింది. కాగా, ఒక్కసారి తాను తల్లిగా మారితే, ఇక తనకు పిల్లలే ప్రపంచమని తెలిపింది. ఇటీవలే 'రంగస్థలం' సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సమంత ప్రస్తుతం 'మహానటి'లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
samanta
naga chaitanya
mother

More Telugu News