'ఐ ఫోన్లు' కానుకగా ఇచ్చిన మహేశ్ బాబు!

  • కొరటాల నుంచి 'భరత్ అనే నేను' 
  • ఈ సినిమాపై నమ్మకంతో మహేశ్ 
  • ఈ నెల 20వ తేదీన రిలీజ్  
'భరత్ అనే నేను' సినిమాను ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ రోజు కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుక జరిగిన దగ్గర నుంచి మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకు ముందు మహేశ్ చేసిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందువలన ఈ సినిమా ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చిపెట్టవలసి వుంది.

ఇక ఈ సినిమా అవుట్ పుట్ పట్ల మహేశ్ బాబు పూర్తి సంతృప్తితో వున్నాడట. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసి .. మంచి అవుట్ పుట్ కి కారణమైన డైరెక్షన్ టీమ్ ను ఆయన ఎంతగానో అభినందించాడట. అంతేకాకుండా ఆ సంతోషంతో వాళ్లందరికీ 'ఐ ఫోన్ X'లను కానుకలుగా ఇచ్చాడట. గతంలో 'శ్రీమంతుడు' హిట్ ను ఇచ్చిన కొరటాలకు మహేశ్ ఖరీదైన కారును కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.    
Go Back to Shorts
Mahesh Babu
kiara advani

More Telugu News