ఐపీఎల్ వేడుకల్లో రణ్ వీర్ సింగ్ కు బదులుగా హృతిక్‌ రోషన్‌!
Add ap7am to your home Screen

ఐపీఎల్ వేడుకల్లో రణ్ వీర్ సింగ్ కు బదులుగా హృతిక్‌ రోషన్‌!

  • ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభవేడుకలు
  • ప్రారంభవేడుకల్లో సందడి చేయనున్న బాలీవుడ్ తారలు
  • హృతిక్‌ రోషన్‌, వరుణ్‌ ధావన్‌, జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌, పరిణితి చోప్రాల షో 
ఐపీఎల్‌ ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఆరంభ వేడుకల్లో బాలీవుడ్‌ నటుడు రణ్ వీర్ సింగ్ షో ఉంటుందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన రణ్ వీర్ ను వైద్యులు విశ్రాంతి తీసుకోమనడంతో, ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రణ్ వీర్ సింగ్ పాల్గొనడం లేదని చెబుతూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వాహకులు వరుణ్ ధావన్ ను సంప్రదించారని, అతను 6 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని బాలీవుడ్ కథనాలు తెలిపాయి.

ఇప్పుడు తాజాగా ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో హృతిక్‌ రోషన్‌ సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. హృతిక్‌ రోషన్‌ ను ఐపీఎల్ నిర్వాహకులు సంప్రదించగా, దానికి సరే అన్నాడని, దీంతో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడని చెబుతున్నారు. ఐపీఎల్ ప్రారంభవేడుకల్లో హృతిక్‌ ‘ధూమ్‌-2’, ‘కహో నా ప్యార్‌ హై’, ‘లక్కీ బై ఛాన్స్‌’, ‘జిందగీ నా మిలేగి దుబారా’ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌ చేయనున్నాడని సమాచారం. అతనితో పాటు వరుణ్‌ ధావన్‌, జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌, పరిణితి చోప్రా తదితరులు ఈ షోలో సందడి చేస్తారు. ఐపీఎల్ ప్రారంభవేడుకలు శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.
hrutik roshan
varun djawan
parineeti
jaqualin farnadase
ipl
Bollywood

More Telugu News