adarsh balakrishna: కృష్ణవంశీ అలా అనడంతో నేను చాలా ఫీలయ్యాను: 'బిగ్ బాస్' ఆదర్శ్
ఆదర్శ్ బాలకృష్ణ కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. అయితే తెలుగు 'బిగ్ బాస్' షో ద్వారా ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావించారు.
"చరణ్ తో నాకు ముందునుంచే పరిచయం ఉండటం వలన ఆయనతో షూటింగ్ చాలా కూల్ గా అనిపించింది" అన్నారు. "ఇక కృష్ణవంశీ గారి దర్శకత్వంలో చేస్తే చాలా నేర్చుకుంటావ్ అని చాలామంది నాకు చెప్పారు. కానీ ఆయనతో వర్క్ చేయడం వలన నాపై నాకు గల నమ్మకం సర్వనాశనమైపోయింది. 'నువ్ జూనియర్ ఆర్టిస్ట్ వి .. నీకు యాక్టింగ్ రాదు' అంటూ ఆయన అవమానపరిచారు. నా నుంచి మంచి అవుట్ పుట్ ను రాబట్టడం కోసం ఆయన అలా అని వుంటారు.
కానీ అప్పుడు నాకు ఇంత దారుణంగా ఉందా నా యాక్టింగ్ అనిపించింది. అయినా ధైర్యం తెచ్చుకుని .. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశాను. ఈ సారి కృష్ణవంశీ దర్శకత్వంలో చేసినప్పుడు ఆయన నుంచి అభినందనలు అందుకునేలా చేయాలని వుంది" అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.