రేపిస్టులను పబ్లిక్‌గా కాల్చిపారేయాలి... బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- రేపిస్టులను కాల్చేందుకు షూటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి
- మహిళలపై వేధింపులకు పదేళ్ల జైలుశిక్ష విధించాలి
- రేప్ చేసిన మైనర్‌ని జువనైల్‌గా పరిగణించరాదు
అంతేకాక మహిళలపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా, వారిని ఉద్దేశపూర్వకంగా తాకినా అలాంటి మృగాలకు కనీసం పదేళ్ల జైలుశిక్షను విధించాలని ఆయన సూచించారు. అసోంలోని నాగావో జిల్లాలో గతవారం ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హతమార్చిన నేపథ్యంలో శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపిస్టుల్లో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. అత్యాచారం చేసిన మైనర్‌ని జువనైల్‌గా పరిగణించడాన్ని ఆయన తప్పుబట్టారు. అతన్ని కూడా ఇతరుల మాదిరిగానే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.