Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు నాగబాబు పెట్టిన ముద్దుపేరు ఇది!
- ఏ హీరో కైనా గ్యాప్ వస్తే.. ఆ గ్యాప్ లో స్క్రిప్టులు చదువుకుంటాడు
- పవన్ అలా చేయడు.. వ్యవసాయం, తోటపని అంటే ఇష్టం
- అందుకే, ‘తోటరాముడు’ అని ముద్దుపేరు పెట్టిన నాగబాబు
తనకు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఇష్టమని, సినిమాల్లోకి రాకపోతే రైతును అయ్యేవాడినని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. రైతుగా ఉండడమంటే తనకు ఎంతో ఇష్టమని తరచుగా చెప్పే పవన్ కు 'తోటరాముడు' అనే ముద్దుపేరు ఉంది. ఇంతకీ, ఆ ముద్దు పేరు పెట్టిందెవరో కాదు, ఆయన సోదరుడు నాగబాబే.
పవన్ సినిమాల మధ్య గ్యాప్ సమయంలో తన ఫామ్ హౌస్ లో పొలం పని చేస్తూ ఉండటం, అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడం తెలిసిందే. ఇదంతా చూసిన నాగబాబు .. పవన్ కు ముద్దుగా ‘తోటరాముడు’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే ఓ సందర్భంలో చెప్పారు. ఏ హీరో అయినా తాను చేసే సినిమాలకు మధ్య గ్యాప్ లభించినప్పుడు తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చదువుకుంటాడని, పవన్ మాత్రం అలా చేయడని .. తోటపని, వ్యవసాయం చేస్తుంటాడని, అందుకే, ‘తోటరాముడు’ అని ముద్దు పేరుపెట్టానని నాగబాబు పేర్కొనడం గమనార్హం.