కల్యాణ్ రామ్ మాంఛి జోరు మీదే వున్నాడు
- సొంత బ్యానర్ పై కల్యాణ్ రామ్ మూవీ
- దర్శకుడిగా సినిమాటోగ్రాఫర్ గుహన్
- ఏప్రిల్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఇక మే 25వ తేదీన 'నా నువ్వే' విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఇలా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, కల్యాణ్ రామ్ మరో ప్రాజెక్టును ఓకే చేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ .. ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై .. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొత్తానికి కల్యాణ్ రామ్ మాంఛి జోరు మీదే వున్నాడు.