గోపీచంద్ 25 వ మూవీ నుంచి వచ్చేసిన ఫస్టులుక్ అదరగొట్టేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ 25 వ మూవీ నుంచి వచ్చేసిన ఫస్టులుక్ అదరగొట్టేస్తోంది

  • గోపీచంద్ 25వ మూవీగా 'పంతం'
  • ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి 
  • మే 18వ తేదీన భారీస్థాయిలో విడుదల   
యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు తెచ్చుకున్న హీరో గోపీచంద్. ఎమోషన్ తో కూడిన కథలతోను .. డాన్సులతోను తనదైన శైలిని చూపిస్తూ, ఫ్యామిలీ హీరోగాను ఆయన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన 25వ సినిమాగా 'పంతం' చేస్తున్నాడు.

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా చక్రి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ గోపీచంద్ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఆవేశం .. ఆవేదనతో కూడిన ఆలోచనలో గోపీచంద్ వున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మే 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.       
gopichand
mehreen

More Telugu News