Pawan Kalyan: టీడీపీపై చేసిన వ్యాఖ్యలతో పవన్ ఇమేజ్ నాశనమైంది : డిప్యూటీ సీఎం కేఈ

షార్ట్స్‌లో చూడండి
టీడీపీపై చేసిన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ ఇమేజ్ నాశనమైందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ఏమైనా చేయదలచుకుంటే పవన్ ఢిల్లీకి వెళ్లాలని, ప్రత్యేకహోదాపై ఆయన మాట మారుస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్ కల్యాణ్, ఢిల్లీ వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.

అధికారంలో లేని వాళ్ల సలహాలు తీసుకుంటే పవన్ కే నష్టమని ఈ సందర్భంగా సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందని పవన్ ఆరోపిస్తున్నారని, జరిగిన అవినీతి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి నిధులు ఇవ్వడం లేదు కనుకనే ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశామని అన్నారు. తమిళనాడు సినీ తరహా రాజకీయాలు ఏపీలో చెల్లవని, ఏపీలో తమిళ రాజకీయాలు చేద్దామనుకుని నాడు చిరంజీవి కంగుతిన్నారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Telugudesam
ke krishna murthy

More Telugu News