'ఎమ్మెల్యే' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే
- కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'ఎమ్మెల్యే '
- కథానాయికగా కాజల్
- ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు
కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లోనే జరపాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్ వినిపిస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి .. ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ వలన , ఈ సారి కల్యాణ్ రామ్ కి హిట్ పడటం ఖాయమనేది యూనిట్ సభ్యుల మాట.