prattipati: నారా లోకేశ్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం: మంత్రి ప్రత్తిపాటి

షార్ట్స్‌లో చూడండి
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని ఏపీలో నిర్మించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అన్నారు. ఆ లక్ష్యంలో పాలుపంచుకునే అవకాశం త‌మ‌కు వచ్చినందుకు సంతోషిస్తున్నామ‌ని అన్నారు. శాసనసభలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయ‌న‌ను అభినందిస్తూ ఈ రోజు ఏపీ శాసనసభలో అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ప్ర‌త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... భవిష్యత్తులో త‌మ‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే పనుల్లో పాలుపంచుకుంటున్నామ‌ని, ఇటువంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామ‌ని అన్నారు. చంద్రబాబు నాయుడు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారని, అలాగే నారా లోకేశ్ కూడా అంతకంటే చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకుంటున్నామని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
prattipati
Andhra Pradesh
assembly

More Telugu News