balakrishna: బాలయ్య సరసన విద్యాబాలన్ చేయడంలేదట!

షార్ట్స్‌లో చూడండి
నందమూరి అభిమానులంతా కూడా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29వ తేదీన సెట్స్ పైకి వెళుతోన్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకం' పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సంప్రదించినట్టు .. ఆమె అంగీకారాన్ని తెలిపినట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె .. ఆ తరువాత తనకి కుదరదని చెప్పిందనేది తాజా సమాచారం. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే ఆమె ఈ పాత్ర చేయలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ పాత్ర కోసం ఇంకా ఎవరైతే బాగా నప్పుతారనే విషయంపై చర్చలు జరుపుతున్నారట. ఫైనల్ గా ఈ పాత్రలో ఎవరు సెట్ అవుతారో చూడాలి.      
Go Back to Shorts
balakrishna
teja

More Telugu News