25వ సినిమాకి రెడీ అవుతోన్న అక్కినేని ఫ్యామిలీ హీరో
Add ap7am to your home Screen

25వ సినిమాకి రెడీ అవుతోన్న అక్కినేని ఫ్యామిలీ హీరో

  • సుమంత్ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • 'ఉగాది' రోజున ప్రారంభోత్సవం 
  • నూతన దర్శకుడికి అవకాశం
మొదటి నుంచి కూడా సుమంత్ సినిమాలు చేసే విషయంలో దూకుడు చూపించినట్టుగా కనిపించడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. అలా 24 సినిమాలు పూర్తి చేసిన సుమంత్ .. తన 25వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు, హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. బొగ్గరం ధీరజ్ .. బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను  త్వరలోనే వెల్లడించనున్నారు.      
sumanth

More Telugu News