Tollywood: తల్లితో సాయిధరమ్ తేజ్, అతని సోదరుడు!

షార్ట్స్‌లో చూడండి
నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తమ తల్లికి హీరో సాయి ధరమ్ తేజ్ తన సోదరుడు వైష్ణవ్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఓ ట్వీట్ చేశాడు. తాను ఉన్నానంటే అందుకు కారణం తన తల్లేనని, ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలని పేర్కొన్నాడు. సాయిధరమ్, వైష్ణవ్ తమ తల్లికి ప్రేమగా ముద్దు పెడుతూ దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సాయిధరమ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
Go Back to Shorts
Tollywood
sai dharam tej

More Telugu News