త్రివిక్రమ్ ఆఫర్ ను తిరస్కరించిన లయ ?
Add ap7am to your home Screen

త్రివిక్రమ్ ఆఫర్ ను తిరస్కరించిన లయ ?

  • కథానాయికగా లయకి మంచి పేరు 
  • ఎన్టీఆర్ సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు 
  • పెద్దగా ఆసక్తిని చూపని లయ
త్రివిక్రమ్ ఈమధ్య కాలంలో తన సినిమాల్లో కీలకమైన పాత్రలకు సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు. అలా 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా .. 'అజ్ఞాతవాసి' సినిమాలో ఖుష్బూ గుర్తుండిపోయే పాత్రలు చేశారు. తాజాగా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'లయ'ను తీసుకోవాలని ఆయన భావించారట.

లయ పేరు వినగానే ఆమె చేసిన 'స్వయంవరం ' .. 'మనోహరం' .. 'ప్రేమించు' వంటి చిత్రాలు గుర్తొస్తాయి .. ఆ పాత్రల్లో ఆమె చూపిన నటన కనులముందు కదలాడుతుంది. ఎన్టీఆర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో లయ అయితే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ ఆమెను సంప్రదించారట. అయితే కారణమేమిటో తెలియదుగానీ ఈ సినిమాలో చేయడానికి లయ పెద్దగా ఆసక్తి చూపలేదనీ .. సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. ఫిల్మ్ నగర్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.      
trivikram
laya

More Telugu News