Chandrababu: చినరాజప్ప కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కాకినాడలో ఈరోజు జరిగిన ఈ వివాహానికి హాజరైన చంద్రబాబు, నూతన వధూవరులను ఆశీర్వదించి .. శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా, హైదరాబాద్ లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు ఈరోజు సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం, హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రికి వెళ్లిన చంద్రబాబు, అక్కడి నుంచి కాకినాడ చేరుకున్నారు. 
Go Back to Shorts
Chandrababu
china rajappa

More Telugu News