sai dharam tej: 'చిత్రలహరి' టైటిల్ వెనుక కథ .. హీరోగా సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
ఒక హీరో కోసం కథను తయారు చేసుకుని .. ఆ హీరోతో చేసే అవకాశం లేనప్పుడు, మరో హీరోకి తగినట్టుగా ఆ కథను మార్చడం జరుగుతూ ఉంటుంది. అలా దర్శకుడు కిషోర్ తిరుమల .. నాని కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు.

 అయితే నాని పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో, సాయిధరమ్ తేజ్ తో చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ తో చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. 'చిత్రలహరి' అనే ఓ 'బార్' చుట్టూ కథ తిరుగుతుందట. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. వినోదప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంతో పాటే, మిగతా వివరాలను త్వరలోనే వెల్లడి చేయనున్నారు.  
Go Back to Shorts
sai dharam tej

More Telugu News