రష్యాతో కలిసి సిరియా అధ్యక్షుడు యుద్ధనేరాలకు పాల్పడుతున్నారు: అమెరికా ఆరోపణలు
- బషర్ అల్ అసద్ యుద్ధనేరస్థుడు
- సొంత ప్రజలపైనే వైమానిక దాడులకు పాల్పడుతున్నారు
- సిరియాలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం
ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా సిరియా అధ్యక్షుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రజలనే బషర్ అల్ అసద్ చంపుకొంటున్నాడని ఆరోపించింది. తిరుగుబాటుదారులపై దాడుల పేరిట సామాన్య ప్రజానీకాన్ని బలితీసుకుంటున్నాడని మండిపడింది. అసద్ ను యుద్ధనేరస్తుడిగా అభివర్ణించిన అమెరికా, సిరియాలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.