varun tej: అప్పుడు మా నాన్న నన్ను కొట్టేశారు .. ఆ తరువాత బాధపడ్డారు!: వరుణ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
నాగబాబు .. వరుణ్ తేజ్ లను చూస్తే తండ్రీ కొడుకులుగా కాకుండా మంచి స్నేహితులుగా కనిపిస్తుంటారు. అయితే ఒకసారి మాత్రం తన తండ్రి తనని కొట్టాడనీ .. ఆ తరువాత మాత్రం ఆయన చాలా బాధపడ్డారని తాజా ఇంటర్వూలో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. " అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు .. ఓ రోజు రాత్రి నేను నా స్నేహితుల దగ్గరికెళ్లి కబుర్లు చెబుతూ ఉండగా, నన్ను వెతుక్కుంటూ మా నాన్న అక్కడికి వచ్చారు. నన్ను అక్కడ చూడగానే కోపాన్ని అణచుకోలేక కొట్టేశారు".

 "ఇంటికివచ్చాక జరిగిన సంఘటన గురించి మా అమ్మకి బాధతో చెప్పాను. నేను వెళ్లి చాలాసేపు కావడంతో మా నాన్న కంగారు పడిపోయారట. ఆ సమయంలో నా మొబైల్ కూడా పనిచేయలేదు. దాంతో 3 గంటలుగా నా కోసం మా నాన్న వెతుకుతూనే వున్నారట. అందువల్లనే ఆయనకి అంతగా కోపం వచ్చిందని అమ్మ చెప్పింది. ఇంకెప్పుడూ చేయిచేసుకోనంటూ మా నాన్న బాధపడటం కూడా నాకు బాగా గుర్తుంది" అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.  
Go Back to Shorts
varun tej
nagababu

More Telugu News