redmi note 5: మూడు నిమిషాల్లోనే మూడు లక్షలు అమ్ముడుపోయిన రెడ్ మీ నోట్ 5 మోడళ్లు

షార్ట్స్‌లో చూడండి
షియోమీ రెడ్ మీ 5, 5 ప్రో స్మార్ట్ ఫోన్లు తొలి ఫ్లాష్ సేల్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు లక్షల ఫోన్లను అభిమానులు 3 నిమిషాల్లోనే ఎగరేసుకుపోయారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రెడ్ మీ వెబ్ సైట్లలో ఈ ఫ్లాష్ సేల్ జరిగింది. భారత్ లో ఇదే అతిపెద్ద ప్లాష్ సేల్ అని, మూడు నిమిషాల్లోనే మూడు లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది.

 ఇక ఎంఐ టీవీ 4 అందుబాటులో ఉంచిన టీవీ సెట్లన్నీ పది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. రెండో విడత ఈ ఫోన్ల ఫ్లాష్ సేల్ ఈ నెల 28న జరగనుంది. వచ్చే బుధవారం 28న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటుందని షియోమీ కంపెనీ భారత విభాగం ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వారానికోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించడం షియోమీ మార్కెటింగ్ విధానంలో భాగం.
Go Back to Shorts
redmi note 5
flash sale

More Telugu News