మహాన్యూస్‌పై దాడి అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్

  • మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడి
  • మహా న్యూస్ వాహనాల ధ్వంసం 
  • విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
  • ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు-పవన్
ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛానెల్ మ‌హాన్యూస్ సిబ్బంది, వాహనాలపై విజయనగరంలో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిని ఖండిస్తూ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 'మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని, మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది' అని పవన్ పేర్కొన్నారు.  
Go Back to Shorts
maha news
Pawan Kalyan
attack

More Telugu News