దేవుడి సేవ .. చపాతీలు చేసిన కెనడా ప్రధాని
- పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ట్రూడో కుటుంబం
- సామూహిక వంటశాలలో చపాతీలు ఒత్తిన వైనం
- ఆలయం అద్భుతంగా ఉందన్న ట్రూడో
ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ, తన కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, ఆలయం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాగా, పంజాబ్ పర్యటనకు వెళ్లిన ట్రూడోను సీఎం అమరీందర్ సింగ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు.