కీర్తి సురేశ్ పై కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్!
- యూత్ లో కీర్తి సురేశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్
- అగ్రకథానాయకుల సినిమాల్లో వరుస ఛాన్సులు
- మేకప్ కారణంగా జరుగుతోన్న ఆలస్యం
షూటింగుకి ఉదయాన్నే వచ్చేస్తుందట .. కానీ కారవాన్ లో నుంచి ఒక పట్టాన బయటకి రాదట. మేకప్ విషయంలో ఆమె తీసుకునే అతి జాగ్రత్తే ఇందుకు కారణమని అంటున్నారు. చిన్న షాట్ కి కూడా హెవీగా మేకప్ చేసుకుని గాని ఆమె కారవ్యాన్ దిగదని చెబుతున్నారు. ఈ కారణంగా సీనియర్ నటీనటులు .. హీరోలు .. యూనిట్ సభ్యులు అంతా కూడా అసహనానికి లోనవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రచారం పట్ల కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.