సైబర్ నేరాలపై లఘు చిత్రం: కలసి నటించిన ఎన్టీఆర్, రాజమౌళి... నేడే థియేటర్లలో విడుదల!
Add ap7am to your home Screen

సైబర్ నేరాలపై లఘు చిత్రం: కలసి నటించిన ఎన్టీఆర్, రాజమౌళి... నేడే థియేటర్లలో విడుదల!

  • హైదరాబాద్ పోలీసులు నిర్మించిన లఘు చిత్రం
  • సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కోసం
  • కలసి యాక్ట్ చేసిన రాజమౌళి, ఎన్టీఆర్
  • థియేటర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి
తాను నిర్మించే సినిమాల్లో అప్పుడప్పుడూ కామియో రోల్స్ చేసి అభిమానులను అలరిస్తుండే దర్శక దిగ్గజం రాజమౌళి, నందమూరి వంశ వారసుడిగా వరుస హిట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ కలసి నటించారు. అయితే, అదేదో సినిమా అనుకునేరు సుమా... కాదు!

హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీరిద్దరినీ పెట్టి ఓ లఘు చిత్రం తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు రాజమౌళే దర్శకత్వం వహించారు. సిటీ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఫిల్మ్ నేటి నుంచి థియేటర్లతో పాటు సోషల్‌ మీడియా మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ తదితరాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లనుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు పీవీఆర్‌ సినిమా థియేటర్‌ లో దీన్ని విడుదల చేశారు.
Hyderabad
Police
Rajamouli
NTR

More Telugu News