చకచకా రెడీ అవుతోన్న 'సవ్యసాచి' .. ఆ రోజునే వస్తాడట!
- షూటింగు దశలో 'సవ్యసాచి'
- కథానాయికగా నిధి అగర్వాల్
- మే 24వ తేదీన విడుదల
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను మే 24వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దాదాపుగా ఈ డేట్ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను రమ్యకృష్ణ చేస్తోన్న విషయం తెలిసిందే