టీఆర్ఎస్ లోకి ముకేశ్ గౌడ్, దానం నాగేందర్!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ నుంచి ముకేశ్ గౌడ్, దానం నాగేందర్ లు చేరనున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కొంత బలహీనంగా ఉన్న టీఆర్ఎస్, మరిన్ని చోట్ల విజయం సాధించేలా హైదరాబాద్ నగర పరిధిలో బలోపేతమయ్యేందుకు ప్రణాళికలు రూపొందించిన కేసీఆర్, మరింత మందిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ తో పోలిస్తే టీడీపీకి అధిక ఓట్లు లభించాయన్న సంగతి తెలిసిందే.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పడ్డ ఓట్లు, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేసరికి టీఆర్ఎస్ వైపు తిరిగాయి. ఇక వాటిని అలాగే కొనసాగించాలంటే, ఓ సామాజిక వర్గం ఓట్లు కీలకమని భావిస్తున్న టీఆర్ఎస్, ఆ వర్గానికి చెందిన బడా నేతలను ఆహ్వానిస్తోందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ముకేశ్, నాగేందర్ లు టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. వీరితో పాటు డివిజన్ల స్థాయిలోనూ ద్వితీయ శ్రేణి నేతలను ఆదరించడం ద్వారా మజ్లిస్ కు పట్టుండే 7 నియోజకవర్గాలు మినహా మిగతా అన్నింటినీ కైవసం చేసుకోవాలన్నది టీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.
Go Back to Shorts
Hyderabad
Greater
TRS
KCR
Danam Nagendar
Mukesh Goud

More Telugu News