కోహ్లీ దూకుడుకు ఫ్లాట్ అయిన పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. ఆరు వన్డేల సిరీస్ లో కోహ్లీ ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. తద్వారా తన వన్డే సెంచరీల సంఖ్యను 35కి పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ విశ్వరూపంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు సైతం కోహ్లీ ఆటకు ఫ్లాట్ అయిపోయారు. 'ఎంతో ఏకాగ్రత కలిగిన బ్యాట్స్ మెన్ కోహ్లీ, వన్డేల్లో 35 సెంచరీలు చేయడం నిజంగా అద్భుతం. కోహ్లీ ఒక జీనియస్' అంటూ నయిన్ అబిదీ ట్వీట్ చేసింది. వాట్ ఏ ప్లేయర్ అంటూ కైనత్ ఇంతియాజ్ ట్విట్టర్ ద్వారా అభినందించింది. 
Go Back to Shorts
Virat Kohli
Pakistan
women cricketer

More Telugu News