ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 21 సంవత్సరాలు .. సభ్యులందరికీ నా అభినందనలు: నారా లోకేశ్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 21 సంవత్సరాలు .. సభ్యులందరికీ నా అభినందనలు: నారా లోకేశ్

  • ప్రజలకు సేవలందించడంలో ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్
  • ‘సమాజమే దేవాలయం -  ప్రజలే దేవుళ్ళు’ అనేదే స్ఫూర్తి
  • ‘ప్రతిజ్ఞ ’పత్రాన్ని పోస్ట్ చేసిన నారా లోకేశ్
ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రజలకు సేవలందించడంలో ఎంతో కృషి, పట్టుదలతో ముందుకుసాగుతున్న ట్రస్ట్ సభ్యులందరికీ తన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ‘ప్రతిజ్ఞ ’పత్రాన్ని పోస్ట్ చేశారు. ‘సమాజమే దేవాలయం -  ప్రజలే దేవుళ్ళు’ అనే ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని లక్ష్యంగా తీసుకుంటూ, ఎన్టీఆర్ ట్రస్ట్ కుటుంబ సభ్యునిగా..నేను చేస్తున్న ప్రతిజ్ఞ ..నేను త్రికరణ శుద్ధితో నిరుపేదల, నిర్భాగ్యుల సేవకు అంకితం అవుతాను..’ అంటూ ప్రతిజ్ఞ  కొనసాగింది.
ntr trust
Nara Lokesh

More Telugu News