'ఛీ' అంటూ 'ప్యాడ్ మ్యాన్'ను చూసేందుకూ ఇష్టపడని పాకిస్థాన్ సెన్సార్ బోర్టు!

షార్ట్స్‌లో చూడండి
మహిళల రుతుక్రమంపై చర్చిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' ఓ వైపు బాక్సాఫీసు వద్ద దూసుకెళుతుండగా, అసలు ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా పాకిస్థాన్ సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తమ ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసేలా ఉందని సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సినిమా దర్శకుడు ఆర్ బాల్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల ఆరోగ్యానికి సంబంధించి తీసిన సినిమా సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని పాక్ లో ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. ఆసియాలో నెలసరి సమస్యలతో మరణించిన వారు ఎందరో ఉన్నారని, ఇక్కడి మహిళలకు ఈ చిత్రం అవసరమని తెలిపారు. కాగా, పాక్ సెన్సార్ బోర్టు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. పలువురు బోర్టు సభ్యులు సినిమా చూడాలని కోరితే ఎవరికి వారు 'ఛీ' అంటూ పక్కకు తప్పుకున్నారట.
Go Back to Shorts
Padman
Pakistan
Bollywood
Akshay Kumar

More Telugu News