బ్రేకింగ్ న్యూస్... భారీగా ఆయుధాలతో సీఆర్పీఎఫ్ క్యాంపులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు!
- పాక్ ఉగ్రవాదుల మరో పన్నాగం
- శ్రీనగర్ లోని సైనిక క్యాంపులో టెర్రరిస్టులు
- ఉదయం నుంచి కూంబింగ్
- ఇంకా పట్టుబడని ఉగ్రవాదులు
ఈ ఉదయం నుంచి కూంబింగ్ జరుగుతుండగా, ఇప్పటివరకూ ఉగ్రవాదులు పట్టుబడలేదు. వీరి వద్ద ఏకే-47 గన్స్, పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయని తెలుస్తోంది. సైనిక క్యాంపుపై దాడి చేసే ఉద్దేశంతోనే వీరు వచ్చుంటారని అధికారులు భావిస్తున్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపులోకి ఉగ్రవాదులు జొరబడిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మరోవైపు సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులో కూడా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.