Chandrababu: చంద్రబాబును విమర్శిస్తూ ట్విట్టర్లో ధ్వజమెత్తిన జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ హామీలు ఇచ్చాయని తెలిపారు. 2014 మార్చిలో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసిందని... ప్లానింగ్ కమిషన్ కు ముసాయిదా కూడా వెళ్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఏ హక్కుతో స్పెషల్ స్టేటస్ ను చంద్రబాబు తాకట్టు పెట్టారని, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని జగన్ ప్రశ్నించారు. కంటితుడుపు చర్యలను చంద్రబాబు ఆపేయాలని... ఎందుకు అలా చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
jagan
Special Category Status

More Telugu News