sai dharam tej: పవన్ పాటలపై కన్నేసిన సాయిధరమ్ తేజ్!
సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఇంటిలిజెంట్' .. ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా, యాక్షన్ ఎంటర్టైనర్ గా కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా సాయిధరమ్ తేజ్ .. చిరంజీవి సాంగ్స్ ను రీమిక్స్ చేస్తూ వస్తున్నాడు. 'గోలీమార్' .. 'అందం హిందోళం' .. 'గువ్వా గోరింకతో' వంటి పాటలను రీమేక్స్ చేస్తూ వచ్చిన సాయిధరమ్ తేజ్, 'ఇంటిలిజెంట్'లో 'ఛమక్ ఛమక్ ఛామ్' సాంగ్ ను రీమిక్స్ చేశాడు.
ఇక తన తదుపరి సినిమాల్లో పవన్ సినిమాల్లోని పాటలను కూడా రీమిక్స్ చేయనున్నట్టు ఆయన చెబుతుండటం విశేషం. పవన్ సినిమాల్లోని పాటలంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పిన సాయిధరమ్ తేజ్, 'తొలిప్రేమ'లోని 'ఈ మానసే .. ' .. 'జానీ' సినిమాలోని 'నా రాజు గాకురా అన్నయ్య' అనే పాటను రీమిక్స్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇక త్వరలోనే మెగా అభిమానులు పవన్ సినిమాలోని పాటలకు తేజు స్టెప్స్ ను చూడనున్నారన్న మాట.